ది ఫిష్ టెయిల్ ఎయిర్ కంపెనీకి చెందిన 9ఎన్-ఏకేఏ అనే ఓ ప్రైవేటు హెలికాప్టర్ గోర్ఖా ప్రాంతం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సిగ్నల్స్ తెగిపోయాయని మధ్యహ్నాం ఈ ప్రమాదపు ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కాగా, ఒక పైలెట్తో సహా ఏడుగురు చనిపోయి ఉంటారని తాము భావిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రమాద స్థలికి నేపాల్ ఆర్మీ, ఇతర సహాయక సిబ్బంది వెళ్లింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు.దాడి: 96 మంది మృతి