Monday, 2 November 2026

కుమార్ రెడ్డి జీ ఎం, ఇ ఆర్,పిఎం కు గణ సన్మానం.. టీబీజీకేఎస్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో

ఇల్లందు జూలై 1 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు కుమార్ రెడ్డి జీ ఎం ఐ ఆర్ & పీ ఎం పదవి విరమణ సందర్భంగా కొత్తగూడెం ఇల్లందు క్లబ్ లో తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి బీ.వెంకట్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య గారు వైస్ ప్రసిడెంట్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లందు ఏరియా వైస్ ప్రసిడెంట్ రంగనాథ్, జిఎం కమిటీ మెంబర్ గౌస్ మియా, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఢిల్లీ శ్రీనివాస్, ఐత లక్ష్మణ్లు కుమార్ రెడ్డి ని ఇల్లందు ఏరియా టి బి జీ కే ఎస్ తరపున సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బలరాం, డైరెక్టర్ పా& ఫైనాన్స్, డైరెక్టర్ పీ & పీ వేంకటేశ్వర రెడ్డి పర్సనల్ జీ ఎం లు బసవయ్య , దీక్షితులు, హనుమంతరావు, కవితా నాయుడు, సి ఎం ఓ వీ వీ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.