రఘునాథ పాలెం జులై 01(జనం సాక్షి)ప్రతీఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి జిల్లా కలెక్టర్ సి పి గౌతమ్ కోరారు. శనివారం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రికొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత సహాయకులు బిట్టా ప్రవీణ్ పుట్టిన రోజు సందర్బంగా జిల్లా క్షయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చికిత్స పొందుతున్న వారి సౌకర్యార్థం (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ ) సెంచరీ పరుపులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సేవచేయాలనే తలంపు చాలా ఉన్నతమైనదని పేద రోగులకు కార్పొరేట్ పరుపులను అందజేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ను అభినందించారు. అలాగే చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు, పర్యవేక్షణాధికారి బి వెంకటేశ్వరరావు, ఆర్ ఎం ఓ శ్రీనివాసరావు, జిల్లా ఆసుపత్రి డీటీషియన్ సూరపొంగు మేరీ జయపాల్, శ్రీకాంత్, పే బ్యాక్ సొసైటీ ఫౌండర్ జంగం లక్మన్ రావు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
టి బి హాస్పిటల్ కు 25 బెడ్ల వితరణ




