హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరికాసేపట్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
మధ్యాహ్నం గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గంటలకు చిల్డ్రన్ పార్క్‌లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేస్తారు.
ఆ తర్వాత అక్కడే భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమై బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్.. సాయంత్రం వరకు బిజీబిజీగా పర్యటన




