కేతావత్ భీల్యా నాయక్ కొండమల్లేపల్లి జనవరి 25 (జనంసాక్షి) న్యూస్ :
చింతపల్లి మండల పరిధిలో గల కుర్మ పల్లి గ్రామంలో నిర్వహిస్థునటువంటి హజరత్ మహబుబ్ సుబాని ఉర్సు ఉత్సవాల్లో చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్న కేతావత్ బీల్యా నాయక్ ఈ సందర్బంగా కేతావత్ బిల్యా నాయక్ మాట్లాడుతూ కుర్మపల్లి లో మెహబూబ్ సుభాని ఉర్సు ఉత్సవాలు మతాలకు అతీతంగా వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఈ దర్గాలో ఎన్నో ఏళ్లుగా దర్శించుకుంటున్నానని ఈ దర్గాకు ప్రత్యేక స్థానం ఉందని అందుకే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అల్లా ఆశీస్సులతొ ప్రజలందరూ ఆయురారోగ్యాలతొ సుఖసంతోషాలతొ మెలగాలని కొరారు.ఈ కార్యక్రమంలో షేక్ గొరెమియ,షేక్ ఉమర్ పాష మొహిన్ పాష మరియు స్థానిక సర్పంచ్ బొడ్డు శ్రీనివాస్,ఎర్ర వెంకటయ్య,చిన్న సైదుల్,యువజన కాంగ్రెస్ నాయకులు కున్రేడ్డి రాజశేఖరరెడ్డి, కిరణ్ నాయక్, గడీగ లింగం,మొతిలాల్ నాయక్,హరి నాయక్, జైపాల్ నాయక్ నాగార్జున నాయక్ మరియు పరిసర ప్రాంత భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
కుర్మపల్లి లో హజరత్ మహబుబ్ సుభాని మహోత్సవానికి హజరైన టిపిసిసి నాయకులు




