Monday, 2 November 2026

కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…

కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…కుల వివక్ష చూపిస్తే చర్యలు తప్పవు…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30గ్రామాల్లో కుల వివక్ష, అంటూ ముట్టు రెండు గ్లాసుల పద్ధతి చూపిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని శంకరపట్నం డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండలంలోని కరీంపేట్ గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ నేటి సమాజంలో కుల మత భేదాలు లేకుండా సోదర భావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. కుల వివక్ష చూపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో కుల వివక్ష అంటూ ముట్టు చూపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనపర్తి మల్లయ్య, ఎంపిటిసి గాండ్ల తిరుపతి, ఇంచార్జ్ ఎంపీడీవో ఖాజా బషీరోద్దీన్, ఏఎస్ఐ పి మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పరంధాములు, తాసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్, కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు