కువైట్‌లో నిషేధిత మాత్రలు కలిగి ఉన్న భారతీయుడి అరెస్ట్
కువైట్: ప్రభుత్వం నిషేధించిన మాత్రలు కలిగి ఉన్న ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో పెద్ద మొత్తంలో మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక దినపత్రిక కథనం ప్రకారం.. సాల్మియా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ భారతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడిని తనిఖీ చేయగా నిషేధిత గర్భస్రావ మాత్రలు లభించాయి. పోలీసుల విచారణలో ఆ మాత్రలు తనకు ఓ ఈజిప్షియన్ ఇచ్చాడని, వాటిని విక్రయించడం ద్వారా తనకు కమిషన్ వస్తుందని చెప్పాడు. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు ఈజిప్షియన్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను నుంచి 500 నిషేధిత మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.