Tuesday, 3 November 2026

కూకట్‌పల్లిలో దొంగల బీభత్సం

హైదరాబాద్‌: కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేసి రూ.3లక్షలు, అరకిలో బంగారం అపహరించారు. దొంగల దాడిలో మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి పరిశీలించిన కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *