Wednesday, 4 November 2026

కూకట్‌పల్లి గల్ఫ్‌ ఆయిల్‌ కంపెనీలో పేలుడు: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని గల్ఫ్‌ ఆయిల్‌ కంపెనీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు మృతిచెందగా 12 మందికి గాయాలైనట్లు పోలీసులు చెప్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని జూబిలీ హిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో యూనిట్‌లో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నలుగురి ఆచూకీ గల్లంతెయనట్లు భావిస్తున్నారు. పేలుడు వల్ల మంటలు భారీగా ఎగసిపడినట్లు సమాచారం. ఈ కంపెనీలోనే గతంలో ఏడుసార్లు పేలుడు సంభవించిందని, తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేలుడు సంఘటనపై ఇప్పటివరకు యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అసలేం జరిగిందన్నది తెలియక ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *