Wednesday, 4 November 2026

బీజేపీ మాటతప్పదనుకుంటున్న : ట్విట్టర్‌లో పవన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందని… ఆ హామీని నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత, సినీహీరో పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు. బీజేపీ మాట తప్పుతుందని అనుకోవడం లేదని పవన్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏ విధంగా ఆకాంక్షిస్తున్నారో.. దానికి అనుగుణంగానే పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. బిల్లులో ఏపీకి పొందిపరిచిన ప్రత్యేక హోదా కల్పిస్తామని ఉందో.. దానిని చూసే ప్రజలు ఓట్లు వేయడం జరిగిందని, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉందని పవన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందనే నమ్మకం తనకు ఉందని కూడా పవన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *