Wednesday, 4 November 2026

వ్యవసాయాభివృద్ధికే ‘మిషన్‌ కాకతీయ’ : హరీష్‌

మిడ్‌మానేరుకు రూ. 750 కోట్లు : కేటీఆర్‌

కరీంనగర్‌, ఫిబ్రవరి 23: ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం కారణంగానే వ్యవసాయ రంగం అభివృద్ధి జరగలేదని, చెరువుల నాశనమయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. సోమవారం జిల్లాలోని ముస్తాబాద్‌లో ఏర్పాటుచేసిన సాగునీటిపై సదస్సులో మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పథకం చేపట్టారని, రానున్న రెండేళ్లలో మిడ్‌మానేరు ప్రాజెక్టును పూర్తిచేసి సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

మరో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మిడ్‌మానేరు నుంచి రూ. 750 కోట్లతో కాల్వ నిర్మాణం చేపడతామన్నారు. సిరిసిల్లలో ఇరిగేషన్‌ కార్యాలయం ఏర్పాటు కోసం కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ముస్తాబాద్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *