హైదరాబాద్: కూకట్పల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి మెట్రో దుకాణం వెనుక ఉన్న గృహసముదాయంలోని కెమికల్ ల్యాబ్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళన చెందారు.




