భైంసారూరల్: రెండో కాన్పులో కూతు రు పుట్టిందని రెండు నెలలుగా భర్త చూడడానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. భైంసా మండల కుంస ర గ్రామానికి చెందిన జాదవ్ మీన(30) కు మూడేళ్ల క్రితం లోకేశ్వరం పొట్ పెల్లి గ్రామానికి చెందిన గణేష్‌తో వివాహమైం ది. మొదటి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండోకాన్పులో మళ్లీ కూతురు పుట్టడంతో భర్త ఇప్పటివరకు చూడడానికి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన మీన మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి నట్లు తెలిపారు




