Thursday, 5 November 2026

-కృష్ణవేణి ఉన్నత పాఠశాల షాద్నగర్ 9 మరియు10 వ తరగతి విద్యార్థులకు

జనం సాక్షి: counselling ప్రోగ్రాం ను స్థానిక యూనివర్సల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ మోటివేటర్ శ్రీ బాగి బాలాజీ గారు విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు మరియు పరీక్షా సమయాలలో తగు ప్రణాళికలతో సమయపాలన సాగిస్తూ నిర్దేశించిన సమయానికి అనుగుణంగా చదవడం వలన అనుకున్న ఉత్తీర్ణతను సాధించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని మరియు పిల్లలు పరీక్షా సమయంలో ఒత్తిడిని అధిగమించి నియమబద్ధంగా ఇష్టంగా చదవడం ద్వారా మీ తల్లిదడ్రులు కన్న కలలను నిజం సాకారం చేయవచ్చని అన్నారు.
మరియు పరీక్షలు రాసేటప్పుడు ఏ విధంగా మసలుకోవాలి విద్యార్థులను ఉద్దేశించి తగు సూచనలు సలహాలను అందించారు తరువాత బాలాజీ గారిని పాఠశాలల డైరెక్టర్స్ సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల డైరెక్టర్ శ్రీ ఎంఏ సత్తార్ గారు జోనల్ మేనేజర్ శ్రీ వహీద్ గారు మరియు పాఠశాలల ప్రిన్సిపల్స్ శ్రీమతి రఫత్ సుల్తానా, శ్రీ నవీన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.