..!
యువకుడి బలవన్మరణం.
కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్.
సిరిసిల్ల బి వై నగర్ లో విషాదం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 17. (జనంసాక్షి). ఉజ్వల భవిష్యత్తు కోసం కన్న ఎన్నో కళలు కండ్ల ముందు ఆవిరి అయిపోతుంటే నిశ్రుహలోకి జారిపోయిన ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందిన విషాద సంఘటన సిరిసిల్ల పట్టణంలోని బి.వై.నగర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం బి.వై.నగర్ కు చెందిన చిటికెన నాగభూషణం సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు నవీన్ కుమార్ (30) హోటల్ మేనేజ్మెంట్ చేసాడు.ఇటీవల సాఫ్ట్వేర్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు .ఈ క్రమంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేదని మనస్తాపం తో శుక్రవారం ఇంట్లో తన గదిలో ఉరివేసుకుని బలవన్మరానికి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. నవీన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్లో తాను బతకడానికి కారణాలేమి లేవంటూ నేను ఎవరికి ఉపయోగం లేను జాబ్ లేదు అంటూ ప్రస్తావిస్తు నా జీవితాన్ని ముగిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. సూసైడ్ పలువురుని కంటతడి పెట్టిస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నవీన్ కుమార్ మరణంతో బి వై నగర్ లో విషాదఛాయలు అలుమ్ముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




