Wednesday, 4 November 2026

కృష్ణాడెల్టా నీరు విడుదలకు ఆటకంగా మారింది: పార్థసారథి

విజయవాడ: తెలుగుదేశం హయాంలో జారీ చేసిన జీవో 69వల్లే కృష్ణాడెల్టాకు నీరు విడుదల ఆటకంగా మారిందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి అన్నారు. ఈ వ్యవహారంపై విజయవాడలో ఆయన విలేకరుతలో మాట్లాడుతూ హైకోర్టులో ఇప్పటికే పిటీషన్‌ దాఖలు చేశామని రేపు జరిగే విచారణలో ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపిస్తుందని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సిద్ధమని మంత్రి తెలిపారు. కర్ణాటక నుంచి నీటి విడుదల కోసం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *