కృష్ణా డెల్టాకు వైఎస్ తీరని అన్యాయం చేశారు: దేవినేని
మొగల్రాజపురం: జలయజ్ఞం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీలో అక్రమాలకు పాల్పడి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కృష్ణా డెల్టాకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన పోతిరెడ్డిపాడు ఆధునికీకరణ పనులతో కృష్ణ డెల్టా నీరు స్వప్రయోజనాలకోసం వైఎస్ పులివెందులకు తరలించారని విమర్శంచారు. దీని ఫలితంగా డెల్టాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెదేపా అనాడే నేడేమయ్యారని ప్రశ్నించారే. డెల్టాకు నీరు విడుదల చేసే విషయంలో ప్రభుత్వం తరపున ఇంతవరకు కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్పించారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.