కెసిఆర్ దుర్మార్గపు పాలనకు అంతం చెబుదాం..!
– రానున్న రోజుల్లో భాజాపే బలమైన పార్టీ.
– అధికారం దిశగా అడుగులువెద్దాం..! సాధించకుందా0..!
జనం సాక్షి భైంసా రూరల్
నవంబర్ 28
– రామారావు పటేల్ చేరిక శుభ పరిణామం.
– భాజపా నాయకులు రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ఎన్నికలలో భాజపా 86 వేల మెజార్టీ ఓట్లతో నైతిక విజయం సాధించిందని ఈ విజయం కేసిఆర్ దుర్మార్గపు పాలనకు ముందు ముందు సమాధానం చెబుతుందని మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రామారావు పటేల్ కాంగ్రెస్ ను వీడి భాజపాలోకి చేరడం శుభపరిణామని, ఆయనతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు చేరికను స్వాగతిస్తున్నామని అన్నారు.అదిలాబాద్ జిల్లాతో తనకు అభినాభా సంబంధాలు ఉన్నాయని అవసరం వస్తే జిల్లా పై మరింత ఫోకస్ పెట్టి కమలం వికసించడానికి కృషి చేస్తానని అన్నారు.రాబోయే రోజుల్లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటినుండే ప్రతి కార్యకర్త కాషాయం ఎదుగుదలకు పనిచేయాలని కొరారు.




