ముస్లిం సోదర, సోదరీమణులు తబ్లిక్ ఇస్తేమా కు భారీగా తరలిరావాలి సయ్యద్ అజీమోద్దీన్ అధ్యక్షులు ఈద్గా కమిటీ. దేవరకొండ
కొండమల్లేపల్లి నవంబర్ 28 జనం సాక్షి న్యూస్ :
ఈ నెల 30 న నల్గొండ పట్టణంలోని ఈద్గాహ్ ప్రాంతంలో జరిగే తబ్లిక్ ఇస్తేమా కు భారీ ఎత్తున ముస్లిం సోదరులు తరలివెళ్లాలని దేవరకొండ ఈద్గాహ్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీమోద్దీన్ పేర్కొన్నారు.శాంతి మరియు అహింస, సందేశమే ఎజెండా గా నల్లగొండ లో ఇస్తేమా జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరౌతారని, మత ప్రభోదకులు ప్రసంగిస్తారని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ స్థాయిలోను పెద్ద ఎత్తున ఇస్తేమాకు తరలి వెళ్లారని పిలుపునిచ్చారు ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో ప్రధాన కార్యదర్శి మహ్మద్ రైస్, అబ్దుల్ హఖ్, మహ్మద్ ఇలియస్ పటేల్, ఫయాస్, మునీర్ తదితరులు పాల్గొన్నారు
ముస్లిం సోదర, సోదరీమణులు తబ్లిక్ ఇస్తేమా కు భారీగా తరలిరావాలి సయ్యద్ అజీమోద్దీన్ అధ్యక్షులు ఈద్గా కమిటీ. దేవరకొండ




