Thursday, 5 November 2026

కెసిఆర్ ని గద్దె దింపడం ఖాయం

 

 

 

 

 

 

లిక్కర్ కవితను వెంటనే అరెస్ట్ చేయాలి
జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్

మహమూత్తారం మార్చి 12 (జనం సాక్షి )మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షులు జాడి సుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ పాల్గొని ముఖ్య నాయకుల కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఆదివారం అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అనేక సమస్యలు కేసీఆర్ ప్రభుత్వంలో పేరుకుపోయి ఉన్నాయని ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని సమస్యల నుండి ప్రజల్ని విముక్తి చేయాలంటే కెసిఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపించాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని వ్యవసాయ రుణమాఫీ పోడు భూములకు పట్టాలు నిరుపేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అనేకసార్లు మోసం చేయడం జరిగింది అని అన్నారు.ఎన్నికల కోసం మరొకసారి కెసిఆర్ అవినీతి సొమ్ముతో గెలవాలని ప్రయత్నిస్తున్నాడని ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి బిడ్డ కవిత కోసం ఢిల్లీలో పైరవీలు చేస్తున్నాడని కవిత లిక్కర్ వ్యాపారం చేయడం సిగ్గుచేటని అవినీతి ఆరోపణలు వస్తున్న కవితను వెంటనే అరెస్టు చేయాలని కవితకు వత్తాసుగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులను కూడా దోషులుగా ఈడి పరిగణంలోకి తీసుకోవాలని కవితను అరెస్టు చేయకపోతే సాక్షాలు తారుమారు చేసి కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కల్వకుంట్ల కుటుంబం నుండి తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవడానికి మళ్లీ షర్మిలక్కతోనే సాధ్యమని కిషన్ అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడని అదే తరహాలో వైఎస్ షర్మి�