ప్రత్యేక ప్రతినిధి / జనంసాక్షి : పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే 20,2023 శనివారం నాడు పెద్ద పెల్లి లోని మూన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు, చత్తీస్గడ్ ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వ హెలికాప్టర్ల కాల్పులు ఏరియల్ ద్రోన్ బాంబుల దాడుల నిలిపి వేయాలని జరిపే బహిరంగ సభకు పెద్దపల్లి పోలీసులు అనుమతి నిరాకరించారు.దీనిపై పౌర హక్కుల సంఘం నేతలు మాట్లాడారు! నిరసన వ్యక్తం చేసారు.వారి మాటలలో…తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వ రాజ్యనిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు 20 మే2023 శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం…
భారతదేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలపై అమలుచేస్తున్న నిర్బంధం మీరు చూస్తున్నదే.చత్తీస్‌గఢ్ ఆదివాసీ గ్రామాలనుండి ఆదివాసీలను ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండ, పెసాచట్టం,రాజ్యాంగం ఇచ్చిన ఐదవ షెడ్యూలు హామీలను ఉల్లంఘించి వారిని నిర్వాసితులను చేసి, అదాని లాంటి కార్పొరేట్లకు ఖనిజాల తవ్వకాలకోసం భూములను ఇవ్వడం కోసం క్రూరమైన నిర్బందాలను అమలుచేస్తున్నది. ఇంకా అమానుషంగా గత రెండేళ్లుగా చత్తీస్గడ్ లోని ఆదివాసి ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ , సరిహద్దుల్లోని పారమిలటరీ సైన్యం ద్వారా ద్రోణులతో బాంబులు దాడులు జరుపుతున్న (రాత్రివేళకే పరిమితమైన) పరిస్థితి నుండి చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్- సుక్మా జిల్లాలలోని పామేడ్- కిష్టారం గ్రామాల మధ్య 10 ఆదివాసి గ్రామాలపై గత11 జనవరి 2023 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ద్రోన్ బాంబులతోపాటు యుద్ధ హెలికాప్టర్ల నుండి కాల్పులు జరిపి పొత్తంహంగి అనే ఆదివాసి మహిళను హత్య చేసినారు.
తమ పౌరులపై ప్రభుత్వమే ఏరియల్ బాంబింగులు వైమానిక దాడులపై నిజనిర్ధారణ చేసి వైమానిక దాడులు నిలిపివేయాలని ఢిల్లీ బొంబాయి కలకత్తా బెంగళూరు హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ షాద్‌నగర్ లో సభలు నిర్వహించి ఐక్యరాజ్యసమితి జెనీవా ఒప్పందం ప్రకారం ,సహజ న్యాయ సూత్రాల ప్రకారం పౌరులపై ఏరియల్ బాంబింగులు హెలిక్యాప్టర్ దాడులు వైమానిక దాడులు పౌరులపై గ్రామాలపై జరపద్దని ప్రపంచవ్యాప్తంగా జెనీవా ఒప్పందంలో భాగంగా ఈ దేశంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం హక్కులను ఉల్లంఘించి ఆదివాసుల హననం చేస్తున్న క్రమంలో ,చత్తీస్గడ్ ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వ హెలికాప్టర్ల కాల్పులు ఏరియల్ డ్రోన్ బాంబుల దాడుల నిలిపి వేయాలని బహిరంగ సభ పెద్దపెల్లి జిల్లా లోని మూన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడానికి ఫంక్షన్ హల్ యజమానికి అడ్వాన్స్ ఇచ్చి హల్ బుక్ చేయూకున్నాం.స్థానిక పోలీసులు హాల్ మీటింగు కూడా పర్మిషన్ కు అప్లై చేయాలని చెప్పి ఫంక్షన్ యజమాని ద్వారా ఒత్తిడి తీసుక వచ్చారు.పౌర హక్కుల సంఘం హాల్ మీటింగ్ కోసం ఇప్పటి వరకు హాల్ మీటింగ్ కోసం ఎక్కడ పర్మిషన్ తీసుకోలేదని అవసరం లేదంటూ, కొత్తగా ఈ 50 సంవత్సరాల పౌర హక్కుల చరిత్రలో ఏ హాల్ మీటింగుకు పర్మిషన్ తీసుకోలేదని చెబితే పెద్దపెళ్లి లొనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాల్ మీటింగ్ లకు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి అని అప్లై చేస్తే ఇస్తామన్నారు. ఇవే మీటింగు మన రాష్ట్రంలో హైదరాబాదులో షాద్‌నగర్‌లో నిర్వహించినామని చెప్పిన కూడా ఫార్మల్ గా మీరు ఇవ్వాల్సిందే అంటే ,రాతపూర్వకంగా పౌర హక్కుల సంఘం పర్మిషన్ కోసం14 మే2023 ఇస్తే సభ జరుపుకోమని మౌఖిక గా చెప్పినారు.మళ్ళీ 18 మే,2023 ఉదయం నుండి పెద్దపెళ్లి పోలీసులు సభకు పెర్మిషన్ కు అవాంతరాలు కల్పిస్తే, పర్మిషన్ ఇవ్వడంలో కొంత టైం తీసుకొని చెప్తావని చెప్పి జాప్యం చేస్తున్న, సందర్భంలో స్థానిక పెద్దపెళ్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మరియు మాజీ కరీంనగర్ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ద్వారా ఈ సభకు పోలీసులు ఆటంకాలు చేస్తున్నారని వారి ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తే సభకు పర్మిషన్ లేదంటూ,నిన్న 19 మే,2023 రాత్రి నిరాకరించి ,సభ నిర్వహించద్దని తేల్చి చెప్పినారు పోలీసులు.ఈ సభాహక్కును నిరాకరించడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సందర్భంగా ఎన్నో వంటావార్పులు,రోడ్డుదిగ్బంధనాలు, హాల్ మీటింగులు సభలు జరుపుకుంటుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం హాల్ మీటింగ్ లో కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని తీవ్ర నిర్బంధాలు చేయడం సరికాదు. ఈ వైఖరిని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. పెద్దపల్లిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాంతాల్లో కేటీఆర్, కెసిఆర్ ఎన్నో మీటింగులు రోడ్లను ఆక్రమించి మీటింగ్ పెడుతున్నారు .మొత్తం అధికార దుర్వినియోగం, చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులతో మీటింగులు చేస్తున్నారు.కానీ రాజ్యాంగంలోని భావవ్యక్తీకరణ ఆర్టికల్19 ను ఏ పౌరుడైన,సంఘమైన అయిన బావ ప్రకటనా స్వేచ్ఛను వ్యక్తపర్చవచ్చు కానీ కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం, సభ హక్కును కాల రాస్తుంది.పెద్దపెళ్లి స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్,కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్,తెలంగాణ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, ఈ పెద్దపెళ్లి పౌర హక్కుల సభ భగ్నం చేయడానికి, కెసిఆర్ కేటీఆర్ లతోపాటు ప్రధాన సూత్రధారులు. ఇప్పటికైనా మీ నిర్బంధ విధానాలు అణిచిచేత విధానాలు మార్చుకోవాలని పౌర హక్కుల సంఘం మరొక్కసారి తెలియజేస్తుంది అని వారు పేర్కొన్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో 1. తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన క్రూర నిర్బంధ చట్టాన్ని హైకోర్టు కొట్టి వేసింది. అట్లాగే కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం దొడ్డి దారిన అధికారం చేజిక్కుచ్చుకొని ,మతోన్మాద రాజకీయాలకు తోడు డబుల్ ఇంజన్ సర్కార్ పేరా 40% పర్సెంట్ కమిషన్లతో పాలన సాగించి ,మే 10,2023 అసెంబ్లీ ఎన్నికల్లో బజరంగ బలి గుర్తుచేస్తూ ఓటేయాలని మోడీ ,అమిత్ షా లు మధ్యయుగాలనాటి పోకడలతో అహంకారం తోఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తే ప్రజలు గుణపాఠం ఇచ్చి ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీని 136 సీట్ల తో గెలిపించారు.
పౌర హక్కుల సంఘం నాయకుల డిమాండ్లు..ఇలా ఉన్నాయి.
కెసిఆర్ ఇప్పటికైనా తన నియంతృత్వ అణిచివేత భూస్వామ్య నిజాం కాలం నాటి అణిచివేత విధానాలను మానుకొని ప్రజాస్వామిక పద్ధతులతో రాజ్యాంగబద్ధ పాలన సాగించాలని అట్లాగే హాల్ మీటింగ్‌లకు పర్మిషన్లని, పోలీసులతో నిర్బంధాలు ప్రయోగించడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం….చత్తీస్ఘడ్ దక్షిణ బస్తర్ ప్రాంతంలో గత మూడేళ్ళుగా కొనసాగుతున్న డ్రోన్ బాంబు దాడులను,హెలికాప్టర్ కాల్పుల ను వెంటనే నిలిపివేయాలి…
2023లో డ్రోన్లతో పాటు యుద్ధ హెలికాప్టర్లతో దాడి చేయడాన్ని జెనివా ఒప్పందం ఉ ల్లంఘనగానే భావిస్తూ ప్రభుత్వం యుద్ధ దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం…
చత్తీస్‌ఘడ్‌లో ఇప్పటికే ఉన్న 100కు పైగా ఉన్న సెక్యూరిటీ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలి.
###.సిలింగేర్ ప్రాంతంలో 500 రోజులకు పైబడి శాంతియుతంగా సిలింగేర్ సెక్యూరిటీ క్యాంపులకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న ఆందోళనకు పరిష్కారంగా వెంటనే సిలింగేర్ క్యాంపును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామ న్నారు.చత్తీస్‌గఢ్ పోలీసులు మరియు పారా మిలటరీ కాల్పుల్లో మరణించిన ఆదివాసీల కు ఒక కోటి రూపాయలు,గాయపడ్డ ఆదివాసులకు యాభై వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
ఆదివాసీ మహిళలపై హత్యాచారాలు, దాడులు, బూటకపు ఎన్కౌంటర్లు చేసిన పోలీసులు పారామిలటరీ బలగాలపై క్రిమినల్ కేసులు నమోదుచేయ్యాలి. ఆదివాసుల గ్రామ సభ తీర్మానం మేరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేయాలి.2004లో సినియర్ ఐఎఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో ఎలాగైతే హైదరాబాద్‌లో శాంతి చర్చలు.జరిగినాయో, మళ్ళీ చిత్త శుద్దితో కేంద్ర ప్రభుత్వం చర్చలు మొదలు పెట్టాలి…..
పెద్ద పల్లి ప్రెస్ మీట్లో పాల్గొన్నవారి లో …
చిలుక చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్.
. నారాయణ రావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
మాదన కుమారస్వామి,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
పుల్ల సుచరిత,ఉపాధ్యక్షురాలు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
నారా వినోద్,ఉపాధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
బొడ్డుపల్లి రవికుమార్ ,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
పోగుల రాజేశం ,కోశాధికారి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
.బి.లక్ష్మణ్,ఈసి మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
కడ రాజన్న,ఈసి మెంబర్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ..యాదవనేని పర్వతాలు, EC మెంబెర్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ..మోట పలుకుల వెంకట్ ,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
కర్క మహేష్,సభ్యుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
రెడ్డి రాజుల సంపత్ ,సభ్యుడు పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
.బండారి రాజలింగు.సభ్యుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ..ఉన్నారు!.




