Tuesday, 3 November 2026

కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి: కోదండరాం

హైదరాబాద్‌: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగేందుకే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్‌ విజయవంతం అయ్యేందుకు కృష చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకు  బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  కేసీఆర్‌ జరిపిన చర్చల్లో అభివృద్థి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కవాతుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, నిర్భంధం విధించి తిరిగి కేసులు నమోదు చేయడం సరికాదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *