హైదరాబాద్ : నీలం తుపాను కారణంగా కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విచారం వ్యక్తం చేసింది. వరద పరిస్థితిని సమీక్షించేందుకు దేశ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్రంలో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రైతులు నిలువునా మునిగినా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆపద సమయాలలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం ప్రదర్శించడం సబబుకాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాలలో పర్యటించి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.




