హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ ప్రభుత్వం రైతులను అవమాన పరుస్తోందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ఇంటి పంచాయితీలు అంటూ మంత్రులు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై కేబినెట్ సమావేశంలో చర్చిచరా అని ఆయన నిలదీశారు. రైతు చావులను రాజకీయం చేస్తున్నారని విహెచ్ విమర్శించారు. కేసీఆర్ ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలను తిట్టడం మానుకుని అన్ని గ్రామాల్లో తిరిగి రైతుల సమస్యలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.




