విజయవాడ, సెప్టెంబరు 13 : నగరంలోని పాతబస్తీ దూల్‌పేట వద్ద రోడ్డుపై రెండు బస్తాల ఓటర్‌ఐడీ కార్డులు కనిపించడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 10వేల ఓటర్ ఐడీ కార్డులు లభ్యమయ్యాయి. కార్డులు రోడ్డుపై పడవేయటంలో ఆంతర్యం ఏమిటన్న దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించి అవకతవకలు జరిగాయా? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2008-2011కు సంబంధించిన కార్టులుగా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.




