కేంద్రానిది దుహాంకారమైన చర్య
# నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట(జనం సాక్షి) మార్చి 25:అధికారం ఉందనే అహంకారంతో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి దరిపల్లి చంద్రం అత్తు ఇమామ్ కళ్లిముద్దీన్ లు మండిపడ్డారు. సిద్దిపేటలో శనివారం స్థానిక పాత బస్టాండ్ వద్ద నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మోదీ ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంలో పరస్పర వ్యాఖ్యలు సహజమే అన్నారు. మోదిని దొంగ అని వ్యాఖ్యానించినందుకు రాహుల్ గాంధీని ఎంపీ పదవీ నుంచి సస్పెన్షన్ చేయడం దారుణం అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర లో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఓర్వలేక మోదీ ప్రభుత్వం ఇలా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిజెపికి చెందిన నేతలు రాహుల్ గాంధీ పై ఎన్ని వ్యాఖ్యలు చేసిన పట్టించుకోలేదని నాయకుడు అంటే ప్రజలకు మేలు చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని అన్నారు. దేశం మొత్తంగా రాహుల్ గాంధీ పై మోడీ ప్రభుత్వం చేస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని ప్రజలతో పాటు విపక్షాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారని ఇది శుభ పరిణామం అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ చెంప చెల్లుమనిపించేలా ప్రజలు తీర్పును ఇస్తారని కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలిముద్దీన్ మార్క సతీష్ గౌడ్. మహేందర్ ఖయాజుద్దీన్ రాకేష్ యాదవ్ బింగి యాదిగిరి. అనిల్ మున్నా సీతా బాలు. రఘుపతి మహారాజ్. అర్జున్. జితేందర్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కేంద్రానిది దుహాంకారమైన చర్య




