ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎందుకు….?
సాగునీరు అందక ఎండిన పంట పొలాలు..
2లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి భారీనష్టం..
కాల్వకు నీళ్లు ఇడుస్తలేరు ఓ రైతు ఆవేదన..
నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో గొంగళ్ల రంజిత్ కుమార్.
గద్వాల: మండలం అనంతపురం గ్రామంలో వ్యవసాయ పొలానికి సాగనీరు అందక పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర లో భాగంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. ఈరోజు బీరెల్లి లో ప్రారంభమైన పాదయాత్ర బస్వాపురం నుండి అనంతపురం గ్రామం మీదుగా సాగి, మధ్యాహ్న విరామం తదనంతరం పూడూరు గ్రామానికి చేరుకోవడం జరిగింది. బస్వాపురంలో గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోయారు గ్రామంలో ప్రభుత్వ స్కూల్ లేక అందరూ ఎర్రవల్లిలోని ప్రైవేట్ స్కూలుకు పంపిస్తున్నట్లు చెప్పారు.అనంతపురం గ్రామంలోని మైబెల్లి అనే ఓ రైతు దాదాపు 5 ఎకరాలకు 2 లక్షల 50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి సాగునీరు అందక వరి పంట మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉందని రైతు ఆవేదన వ్యక్తంచేశారు…
ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఎందుకు.




