.వెంటనే కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో సిఐ గోపికృష్ణను అరెస్ట్ చేయాలి!……..పౌర హక్కుల సంఘం……………………..భూపాలపట్నం గ్రామం,చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లాకు చెందిన బోడిగ శ్యామ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపికృష్ణ బెదిరింపులకు 21 ఏప్రిల్,2023న ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటనపై ఈరోజు 25 ఏప్రిల్ 2023న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ, భూపాలపట్నంలోని శ్యామ్ కుటుంబీకులను ,చొప్పదండి పోలీసులను కలిసి సేకరించిన నిజ నిర్ధారణ వివరాలు.భూపాలపట్నం గ్రామం చొప్పదండి,మండలం కరీంనగర్ జిల్లాకు చెందిన బోడిగా శ్యామ్ 52 సంవత్సరాలు .ఆయనకు భార్య సుజాత కుమారుడు సంజయ్, కుమార్తె శ్రీ కావేరి తో కలిసి కరీంనగర్ లోని విద్యారణ్యంపురి, అపోలో హాస్పిటల్ దగ్గర నివసిస్తున్నాడు. తన జీవనం కోసం 25 సంవత్సరాలుగా కొద్దిపాటి కమిషన్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన గోపికృష్ణ ,(సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నాడు), తనకు 20 గుంటల భూమి కొంటానని, తన మిత్రుడు మధ్యవర్తి అయిన బాలాజీ తో బోడిగే శ్యామ్ మధ్యవర్తిత్వం ద్వారా భూపాలపట్నంలో 20 గుంటల భూమిని ,గుంటకు రెండున్నర లక్షల చొప్పున 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా తన పేరున తనతల్లి పేరున చేసుకున్నాడు.కొంత భూమిని బోడిగి శ్యాం పేరున ప్లాట్ ల అమ్మకం కోసం రిజిస్ట్రేషన్ చేసాడు.దీనికి శ్యాముకు 10లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పందంగా నోటిమాటగా అన్నాడు సిఐ గోపి కృష్ణ.అయితే ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ డల్ గా ఉన్న సందర్భంలో, ఆ ప్లాట్లు 4 లక్షల రూపాయలతో డెవలప్ చేసినాడు శ్యామ్. అయినా కూడా ప్లాట్ లు అమ్మకానికి పోలేదు. ఇవేవీ పట్టించుకోని సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపికృష్ణ పది లక్షల రూపాయలు ఇవ్వాలని రామును తీవ్రంగా వేధించుడు బెదిరించుడు చేసినాడు. అయితే ఈ వేధింపులకు తీవ్ర భయాందోళన గురైన శ్యామ్ జనవరి 2023 చివరివారంన కరీంనగర్ లోని ప్యారడైజ్ రెస్టారెంట్లో గోపికృష్ణను ,బాలాజీని తన భార్య సుజాత సమక్షంలో కలిసి డబ్బు ఇవ్వలేదని వేడుకున్నాడు శ్యామ్,నువ్వు కచ్చితంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని CI గోపికృష్ణ బెదిరించి పంపినాడు. ఈ సంఘటనకు బీతిల్లిన శ్యామ్ తన తోటి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ,అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ,ప్రతిపక్ష నాయకులతో గౌడ సామాజిక వర్గానికి చెందిన పెద్దమనుషులతో సంప్రదించి ఈ ఆపద నుంచి గట్టెక్కియాలని వేడుకున్నాడు .గోపికృష్ణ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో లో CI గా పనిచేస్తున్నాడు, అతనితో గొడవ పెట్టుకోవద్దు ఏదో విధంగా బయటపడాలన్న కావున నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకో ఎవరు అతనికి వ్యతిరేకంగా రారు ,అని తన మిత్రులు నాయకులు శ్యామ్ రెండవసారి 27 ఫిబ్రవరి 2023న హైదరాబాదులో బాలాజీ ఆఫీసు నందు ముఖాముఖిగా గోపికృష్ణ ను కలవడానికి బాలాజీ ఆఫీస్ కి వెళితే అక్కడికి రాకుండా గోపికృష్ణ, ఫోను ద్వారానే వేధించి నాలుగు లక్షల డెవలప్మెంట్ ఖర్చులు, నగతు మూడు లక్షల రూపాయలు,ఇప్పుడు మూడులక్షల రూపాయలు ఇస్తానన్న కూడా అందుకు, ఒప్పుకోక నువ్వు ఇవ్వాల్సినవి 10 లక్షలు కాదు 15 లక్షలు, 50 లక్షల డబ్బులు భూమికి, అదనంగా 10 లక్షల మొత్తం 60 లక్షలు ఇవ్వాలని బెదిరించినాడు.ఎంత బ్రతిమిలాడి ప్రాధేయపడిన వినకుండా హెచ్చరించినాడు ,తనకు చావు తప్ప శరణ్యం లేదు ఆత్మహత్య చేసుకుంటానని వేడు కున్నా కూడా కనికరించకుండా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లలే కరువైతరు చొప్పదండి సీఐ నా మిత్రుడు అతనితో నీపై కేసులు పెట్టిస్తా అని దబాయింపు చేస్తూ హెచ్చరించాడు. ఈ హెచ్చరిక నేపథ్యంలో తీవ్ర మనోవేదన గురైన శ్యామ్ 21 శుక్రవారం 2023న సాయంత్రం భూపాలపట్నంలో ఇంటి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయినాడు .డైరీ లో 10 పేజీల సూసై డ్ నోట్ రాసాడు శ్యాం. భార్య సుజాత ఫిర్యాదుకుచొప్పదండి పోలీసులు గోపికృష్ణ పై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినారు ,కానీ ఈరోజు 25 మంగళవారం2023, నాటికి కూడా గోపికృష్ణ ను అరెస్టు చేయలేదు .గోపికృష్ణ సిఐబి సిఐ అయినందువలనే ఎక్కువ వేధింపులు బెదిరింపులు చేయడంతోనే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని. బెదిరింపులకే శ్యామ్ ఆత్మహత్య జరిగింది నిజానికి గోపికృష్ణ చేసిన హత్యగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది.ఈ ఆత్మహత్య పై పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, డిజిపి లిఖిత పూర్వకంగా త్వరలో చేస్తుంది…డిమాండ్లు.. వెంటనే సిఐబి కేంద్ర సిఐ గోపికృష్ణను వెంటనే అరెస్టు చేయాలి, విధులనుంచి నుంచి తొలగించాలి .## తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,డిజిపి తక్షణమే స్పందించాలి.ఈ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లో పనిచేస్తున్న సిఐబి ఇతర పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర పోలీసులు రియల్ ఎస్టేట్లో చేస్తున్న వ్యాపారాల మాఫియాను అరికట్టాలి.బాధిత శ్యాం కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
ఈ నిజానిర్దారణ లో పాల్గొన్న వారు.1.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ.2.శ్రీపతి రాజగోపాల్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.3.పుల్ల సుచరిత, ఉపాధ్యక్షురాలు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.4.గడ్డం సంజీవ్ కుమార్, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.5.పోగుల రాజేశం, కోశాధికారి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.6.మోటపలుకుల వెంకట్, EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.7.మార్వాడీ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్, తెలంగాణ రాష్ట్రం..




