హుజూర్ నగర్ ఏప్రిల్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణ, మండల, నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హుజూర్ నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. మంగళవారం పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఆత్మీయ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్నగర్ ప్రాంత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతోమంది జర్నలిస్టులు జర్నలిజం వృత్తిలో ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్నారని వారందరికీ న్యాయం జరిగేలా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పూలమాలలు, శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధి వర్గం పిల్లల మర్రి శ్రీనివాసు, బసవోజు శ్రీనివాస చారి, కిత రామనాదం, దేవరం వెంకటరెడ్డి ,కోమరాజు అంజయ్య, ఆర్ పి గౌడ్, రామ్ రెడ్డి, జానీ పాషా, రాజు, శ్రీనివాసు, రామకృష్ణ, గురవయ్య పాల్గొన్నారు.




