హైదరాబాద్: ఎన్నికల ఖర్చును బహిర్గతం చేసినందుకు మరాఠా ఎంపీ గోపీనాథ్ ముండేకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదులు ఇవ్వడాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తప్పుబట్టారు. ఇలాంటి చర్యలతో నిజాయతీపరులు బయటపడేందుకు ముందుకురారని జేపీ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ సీఈసీ నిర్ణయం అపరిపక్వంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సంస్కరణలకు ఈసీ నిర్ణయం విఘాతం కల్గించేదిగా ఉందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్‌కు జేపీ ఓ లేఖ రాశారు. ఎన్నికల వ్యయం విషయంలో అభ్యర్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు.




