హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో విధానం దేశంలో పలుచోట్ల వెలుగు చూసిందన్నది వాస్తవమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిన్ అనిల్ రమేశ్ దవే అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ పరిస్థితులు…. పన్నుల విధానాలపై ఆయన ప్రసంగించారు. ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మధ్య కాలంలో క్విడ్‌ప్రోకో విస్తరిస్తోందని అందోళన వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యపడుతోందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా టాక్స్ ప్రాక్టిషనర్స్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిన్ ఆర్‌కే అగర్వాల్ హాజరయ్యారు.




