కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జహీరాబాద్ జనవరి 7 (జనంసాక్షి)
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి, జహీరాబాద్ అసెంబ్లీ పాలక్ సుగుణకర్ రావు కార్యకర్తలకు సూచించారు. శనివారం బూతు స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జులు సైనికులు గా పనిచేయాలన్నారు బూత్ కమిటీలు ఏర్పాటు, పార్టీ విస్తరణ మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియ చేయడం జరిగింది.ఈ సమావేశంలో బీజేపీ, జిల్లా నాయకులు చింతల్ గట్టు సుధీర్, పులా సంతోష్, విశ్వనాథ్ యాదవ్, నరేశ్ పాటిల్, మల్లికార్జున్ పాటిల్, ఝరాసంగం మండల అధ్యక్షులు ఆడివన్న, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు యాదవ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాటిల్, యువ మోర్చా మండల అధ్యక్షులు బంట విశ్వనాథ్, సుధీర్ బందారి, , తదితరులు పాల్గొన్నారు
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి




