సిఎస్సి లో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ నమోదు
సిఎస్సి జిల్లా మేనేజర్ రాజు
రేగోడ్// జనంసాక్షి // జనవరి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన నమోదును కామన్ సర్వీస్ సెంటర్లలో చేపడుతున్నారని సిఎస్సి జిల్లా మేనేజర్ రాజు అన్నారు శనివారం రేగోడ్ లోని (మహావీర్ మీసేవ) సిఎస్సి కేంద్రాలను ఆయన పరిశీలించారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారని తెలిపారు. మొదటి విడతలో ఎంపిక చేయబడిన కుటుంబాలకే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు రెండో విడతలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ కార్డు వస్తుందన్నారు జిల్లాలోని సి ఎస్ సి ల ద్వారా చేపడుతున్న ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ నమోదును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవింద్ రావ్ జైన్,శ్రీనాథ్ చారి తదితరులు ఉన్నారు.




