Tuesday, 3 November 2026

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి – మోడీ నిరంకుశ పరిపాలన విధానాలపై నిరసనల జ్వాల

హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సారధ్యంలో హుజూర్ నగర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం దెబ్బతినేలా నిత్యవసర వస్తువులు, గ్యాస్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా స్థానిక వివేకానంద సెంటర్లో హుజూర్ నగర్ పట్టణములో మేళ్లచెరువు, మఠంపల్లి, చింతలపాలెం మండలాల నుండి భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొని ముక్తకంఠంతో నినదీస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వారి నిరసనలను వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మోడీ నిరంకుశ పాలనను ఎండగడుతూ పేద, మధ్యతరగతి బడుగు, బలహీన వర్గాల బాధలు పట్టించుకోని మోడీ, అంబానీ, ఆదనీలా ఆస్తుల పరిరక్షణ కోసం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి, కార్పొరేట్ శక్తులకు భారతదేశాన్ని తాకట్టు పెడుతున్నారని, ఇలాంటి నిరంకుశ బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించే రోజు వస్తుందని ఇక మోడీ, బిజెపి పాలకుల ఆటలు సాగవన్నారు. ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశ్ కి నేతగా నేడు భారతదేశ రాజకీయాలలో ఒక సారథిగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకొని వచ్చి మోడీకి దీటుగా సమాధానం చెప్తారని, పెంచిన నిత్యవసర ధరలు, గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని లేకపోతే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, జడ్పిటిసి కొప్పులు సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మఠంపల్లి ఎంపీపీ పార్వతీ కొండ నాయక్, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, హుజూర్ నగర్ పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మారామ్ రెడ్డి, యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, సీనియర్ నాయకులు గోల్డ్ పిచ్చయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ, వివిధ మండలాల, గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని అనుభంద సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువజన, మహిళ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, వార్డు అధ్యక్షులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మహిళ పట్టణ, వార్డు ప్రతినిధులు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.