Tuesday, 3 November 2026

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి -భోజన విరామ సమయంలో నిరసన.

గద్వాల నడిగడ్డ మార్చి 3 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డివిజన్ విద్యుత్ కార్యాలయం ఎదుట శుక్రవారం వారం అధికారులు సిబ్బంది, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.విద్యుత్ శాఖ పిఆర్సి జేఏసీ గద్వాల విద్యుత్ శాఖ పిఆర్సి జేఏసీ నాయకులు
మాట్లాడుతూ మన డిమాండ్స్ నెరవేరేవరకు ఉద్యమాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించాలని, తెలంగాణ రాష్ట్ర పిఆర్సి జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ కార్యాలయం ఎదుట భోజన విరామం తర్వాత నిరసన కార్యక్రమం తెలియజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రామకృష్ణ, కో చైర్మన్ సంధ్య అశోక్, కన్వీనర్ శ్రీనివాస్, యుగంధర్ రెడ్డి, నరసింహ, దేవేంద్రయ్య ,వెంకట రాములు శాలన్న ,మురళి, సుప్రియ ,విమల, నాగేష్ పరమేష్ ,భాస్కర్, ప్రసాద్,
సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.