విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైపల్యం – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఫిబ్రవరి 12 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో తక్కువ నిధులు వచ్చాయని నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇచ్చిన విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ప్రసంగంలో విభజన హామీలపై ఎటువంటి ప్రసంగం జరగలేదన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని రెండింతలు రెట్టింపు చేస్తానని రైతులకు హామీ ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, ఎయిమ్స్ కు వంటి వాటిని హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎరువులు, డీజిల్ ధరలు రెట్టింపు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం ఆదానీ చేతుల్లో పెట్టిందన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పై పాలకులు స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా సరిగ్గా కాకపోవడంతో, సాగునీరు అందకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, పీఎసీఎస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మంజు నాయక్, ఎండి. నిజాముద్దీన్, కస్తాల శ్రావణ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




