Wednesday, 4 November 2026

విజేతలకు బహుమతులు అందజేత

 

 

 

 

జహీరాబాద్ ఫిబ్రవరి 12 (జనం సాక్షి )జహీరాబాద్ పట్టణంలో ఆర్కా రేనాల్ట్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కనెక్ట్ పోగ్రామ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కా రేనాల్ట్ ఫ్యామిలీ కనెక్ట్ లో భాగంగా విద్యార్థుల కు చిత్రలేఖనం లో పోటీలు నిర్వహించిన అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయికోటి నర్సిములు మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు అన్ని రంగాల్లో దూసుకోపోవలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కా రేనాల్ట్ ఆర్ ఎస్ ఎం, రవికుమార్, ఏ ఎస్ ఎం ప్రదీప్ కుమార్, యువ నాయకులు రాజేందర్, బి ఆర్ ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి రవి, ఉపాధ్యాయులు రాజేందర్ ప్రసాద్, రిటర్డ్ ఉపాధ్యాయులు రాంచందర్, సంస్థ సిబ్బంది సుధీర్ ,కిషోర్, తదితరులు పాల్గొన్నారు.