Monday, 2 November 2026

కేంద్ర బడ్జెట్‌లో ఎపికి తీవ్ర నిరాశ

కేటాయింపులు అంతంతమాత్రమేనన్న చంద్రాబాబు
హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధప్రదేశ్‌కు కేంద్ర బ్జడెట్‌లో  పూర్తి న్యాయం చేయలేకపోయారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇస్తామన్న విధంగా కేటాయింపులు లేవని అన్నారు. అలాగే వివిధ పథకాలు,రాజధాని నిర్మాణం తదితర ప్రాజెక్టుకలకు కూడా కేటాయింపులు జరక్కపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. ఆయన శనివారం సాయంత్రం లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ బ్జడెట్‌ చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నిరాశ నిస్పృహలు వచ్చాయన్నారు. జన్‌ధన్‌ యోజన, ఆధార్‌లపై మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆంధప్రదేశ్‌కి చాలా ఇబ్బందులున్నాయని తాను మొదట్నుంచీ చెప్తున్నానని, అయినా కేంద్ర బ్జడెట్‌లో ఆంధప్రదేశ్‌కు పూర్తి న్యాయం చేయలేకపోయారని చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఎపికి అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తామని, డిల్లీ ని మించి ఉంటుందని చెప్పారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి లో జరిగిన సభలో మోడీ స్వయంగా ఈ విషయం తెలిపారని, రాజధాని నిర్మాణం చేస్తామన్నారని , వెంకయ్య నాయుడుకు కాని,తమకు కాని బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన హావిూని అమలు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని ఆయన అన్నారు.అయితే అదైర్యపడి చేయగలిగింది లేదని, దైర్యంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. కేంద్రాన్ని ఒప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. మిత్రపక్షమైనప్పటికీ ప్రజలకు న్యాయం చేయాలి కదా అని  చంద్రబాబు నాయుడు అన్నారు. విూరు ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు కనుక విూ ముందు ఆప్షన్లు ఏమిటని అంటే ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రజలతోనో పోరాటం చేస్తామని ,అందరూ సహకరించాలని,విూడియా కూడా సహకరించాలని, ఆయన అన్నారు. ఎన్‌.డి.ఎ.కూడా సహకరించాలని,కాని అది జరగలేదని అదే బాధ అని అన్నారు. కేంద్రం వింటుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. పొరపాటున జరిగిందా?లేక అదికారులు చేసిన పొరపాటా అన్నది తెలియాలని అన్నారు. ఆర్ధిక సంఘం రాష్టాల్ర వాట పెంచినందున ¬దా ఇవ్వడంలేదని అంటున్నారని, కాని ఆ వాటా పెరిగిన తరవాత కూడా ఎపి లోటులో ఉంటుందని చంద్రబాబు అన్నారు.తానే హైదరాబాద్‌ అబివృద్ది చేశానని , ఇంకో ప్రాంతం నష్ట పోయినందున దానిని అభివృద్ది చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. అయితే తమకు ,బిజెపికి రాజకీయ గ్యాప్‌ లేదని,ఆర్దిక గ్యాప్‌ ఉందని అన్నారు. మరి ఈ పరిస్తితిపై ఏమి చేస్తారని అడిగితే అన్ని విషయాలు ప్రజల ముందు పెడతానని ఆయన అన్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కుంటామని అన్నారు. బడ్జెట్‌ మొత్తంగా చూస్తే  వ్యవసాయ అనుబంధ రంగాలకు తగినన్ని నిధులు కేటాయించలేకపోయారన్నారు. దాంతో ఆ రంగాల్లో ఉపాధిపై ఆధారపడినవారు నిరాశకు గురయ్యారని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే పాడిపరిశ్రమకు నిధులు తగ్గిపోయాయి. ఆంధప్రదేశ్‌లో చాలా ఇబ్బందులున్నాయని మొదట్నుంచీ చెప్తున్నామని అన్నారు.  రాష్ట్ర విభజనలో అన్యాయం చేసినందుకే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.  రెండు ప్రాంతాల మధ్య శాశ్వతంగా విభేదాలు ఉండటానికి వీల్లేదని, చర్చించి న్యాయం చేయాలని కోరాననన్నారు. అలాగే  రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇచ్చి ఆదుకోవాలని కోరామని,  పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు ఇచ్చారు. అది ఏ మూలకు వస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు.  హైదరాబాద్‌ లాంటి రాజధాని రావాలంటే 15 ఏళ్లు పడుతుందని, లక్ష కోట్లయినా ఖర్చవుతుందని ఆనాడే చెప్పానన్నారు.  విశాఖ రైల్వే జోన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా బాబు అసమనం వ్యక్తం చేశారు. తాను రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ ఏడాది కరవు కూడా వచ్చిందని, ముప్పై ఆరు శాతం వర్షం తక్కువగా ఉందని ఆయన చెప్పారు.అదే సమయంలో విశాఖ వద్ద హుద్‌ హుద్‌ తుపాను వల్ల అరవైవేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.రాజధాని ని విజయవాడకు మార్చడానికి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఇన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటే కేంద్రం న్యాయం చేయలేదని బాధ అని అన్నారు. విూరు ఊ అంటే పోరాటానికి సిద్దమని చిత్తూరు ఎమ్‌.పి అంటున్నారని అడగ్గా బాబు ఇలా అన్నారు. ఇంతకీ పోరాటానికి సిద్దమా?కాదా అన్నదానిపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వకుండా ఈ సమాధానం చెప్పారు. విభజనకు వ్యతిరేకం కాదని , అయితే చర్చ జరగాలని కోరానని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.రాష్టాన్రికి రావాల్సిన నిధులపై కేంద్రంతో మళ్లీ మాట్లాడతామని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో హుద్‌హుద్‌ తుపాను వల్ల రూ. 61 వేల కోట్లు నష్టం వచ్చిందని, తెలంగాణ, కర్ణాటక వంటి రాషాలెతో సమానంగా అభివృద్ధి చెందేదాకా కేంద్రం సాయం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఏపీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ఈరోజు కాదు, నిరంతరం పోరాడుతున్నామని ఆయన తెలిపారు.  విభజన అనేది అధికారుల నిర్ణయం కాదని, రాజకీయ నిర్ణయమని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే మళ్లీ రాజకీయ నిర్ణయాలు జరగాలని అడుగుతున్నానన్నారు. ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి తాను అన్ని రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి ఆయన గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *