జనం సాక్షి :కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి.11 కేంద్రంలో జిల్లా బిజెపి అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు బి ఎం ఎస్, భారతీయ మజ్జూరు యూనియన్ పెంట్లవెల్లి ఆటో యూనియన్ BMS ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఎల్లేని సుధాకర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యులు మంగళవారం రోజు 14వ తారీకు రోజు హైదరాబాదులో జరిగే బి.ఎం.ఎస్ మీటింగ్ కు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరుచున్నాము ప్రతి కార్మికునికి 10.వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇవ్వాలి తెలంగాణలో కనీస వేతనాలు జీవోను వెంటనే సవరించాలి బీడీ కార్మికులకు కనీస వేతనం 5000 వేల రూపాయలు ఇవ్వాలి. నూతన రిక్రూట్‌మెంట్ తో అన్ని కేటగిరిలలోని ఖాళీలు భర్తీ చేయాలి ఇంకా అనేకమైన రకాలతో కూడినటువంటి డిమాండ్లు ఉన్నాయి మంగళవారం రోజు జరిగే మీటింగుకు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నరసింహ ప్రధాన కార్యదర్శి కేశవులు వెంకటేష్ రవి మహేష్ బి ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆచారి పాల్గొన్నారు




