కేకే మహేందర్ రెడ్డి మా నాయకుడు.. అభద్రతాభావంతో కొందరు నాయకులు చేస్తున్న చర్యలను పట్టించుకోవద్దు..

సిరిసిల్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21.(జనంసాక్షి). సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి తమ నాయకుడని సిరిసిల్ల నియోజకవర్గం లోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు అన్నారు.సోమవారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అన్ని మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ సిరిసిల్లలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన ఎసిసి నాయకులు క్రిస్టఫర్ లతీక్. ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు పార్టీ నాయకత్వం చేసిన దిశా నిర్దేశం ప్రకారం ముందుకు సాగుతామని అన్నారు. ఆదివారం రోజున భద్రతాభావంతో కొందరు నాయకులు చేసిన చర్యలను పట్టించుకోవద్దని తెలిపారు. తామంతా నియోజకవర్గ నాయకులు కేకే మహేందర్ రెడ్డి వెంటే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రచారం చేస్తామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు టోనీ, ఎల్లారెడ్డిపేట్ మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి, గంభీరావుపేట్ మండల అధ్యక్షులు హమీద్, వీర్నపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్, సద్ది లక్ష్మారెడ్డి, లింగాల భూపతి, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.