Wednesday, 4 November 2026

కేజీబీవీ ఎస్ఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 8 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మంగళవారం నాడు సమయం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక అగంతకుడు పాఠశాలలోకి చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదిలో చొరబడి, విద్యార్థినిలకు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఈ విషయం ఇక్కడ ఉన్న వాచ్మెన్ పాఠశాల ఎస్ఓ కి చెప్పిన స్పందించలేదు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాలకు రావడం జరిగింది వచ్చిన తర్వాత హడావుడిగా తల్లిదండ్రులకు భయఆందోళన కలిగించే విధంగా సమచారం అందించడం జరిగింది తల్లిదండ్రులు హడావుడిగా ఆ రాత్రికి పాఠశాలకు చేరుకొని పాఠశాల సిబ్బందిని ప్రశ్నించి సరైన సమాధానం సరైన భద్రత లేకపోవడంతో తమ పిల్లలను తీసుకెళ్లడం జరిగింది గతంలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు పది మంది విద్యార్థినిలు అనారోగ్యం పాలైనా పై అధికారులకు తెలియపరచకుండా సమస్యను దాచి విద్యార్థులను ఇబ్బంది కలిగేలా చేసారని
పాఠశాల నిర్వహణకు ఇచ్చిన బడ్జెట్, వచ్చినా అందులో కొంత వాడకుండా ఏలాంటి భద్రత పరమైన చర్యలు మరియు సరైన ఆహారం, వసతులు పిల్లలకు అందించకుండా నిర్లక్ష్య వహించిన ఎస్ఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కి దేవరకొండ ఐక్య విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు వెంటనే కేజీబీవీ విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచాలని, దుర్వాసనను రాకుండా చూడాలని, పాఠశాల ప్రాంగణంలో లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని కేజీబీవీ పాఠశాలపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ ఉండాలని వెంటనే విద్యార్థునుల తల్లిదండ్రులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని వీలైనంత తొందరగా కేజీబీవీ భవనం మార్చాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎండీ.ఖదీర్, రామవత్ సేవ నాయక్, రామవత్ లక్ష్మణ్, కొర్ర.నాగరాజు నాయక్,మురళి కృష్ణ, కొత్త అఖిల్, కోటేష్, పసుపులేటి శివ, బోడ అశోక్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.