Wednesday, 4 November 2026

జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ గోడపత్రిక విడుదల చేసిన విగ్రహ కమిటీ సభ్యులు 

 

 

 

మఖ్తల్ ఏప్రిల్ 08 (జనంసాక్షి) నర్వ మండలంలోని రాయికోడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆది గురువులు మహాత్మా  జ్యోతిరావు పూలే మరియు సావిత్రిభాయి పూలే  విగ్రహావిష్కరణ కార్యక్రమం యొక్క గోడ పత్రికను నర్వ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో విగ్రహాల దాతఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహ దాతలు మాట్లాడుతూ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలను గ్రామంలో ప్రతిష్టించి వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దండు అయ్యప్ప, బి ఆర్ ఎస్ నాయకులు డి శంకర్, గడ్డం నరసింహ, ఎం ఎస్ పి జిల్లా అద్యక్షుడు జీ వెంకటయ్య, పూలే విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు జీ అంజి, పి రవి, యం.శంకర్ తదితరులు పాల్గొన్నారు