కేజ్రీవాల్ కేబినెట్ తొలి భేటీ నేడే
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రివర్గం భేటీ కావడం ఇదే ప్రథమం. ఆరుగురు మంత్రులతో కేజ్రీవాల్ సమావేశమై ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనున్నారు. ఈ భేటీ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. అయితే ఇవాళ ఉదయం కేజ్రీవాల్ ట్విట్ చేశారు. జ్వరం తగ్గింది. ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఎప్పటి లాగే ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్, యోగా చేశానని తెలిపారు. ఎన్నికల సమయంలో మార్నింగ్ వాక్, యోగా బంద్ చేసిన విషయం తెలిసిందే.



