హైదరాబాద్ : ఓ మహిళ రోడ్డుపై ఆడుకుంటున్నఅక్కాచెల్లెళ్లను మీ నాన్న పిలుస్తున్నాడంటూ కిడ్నాప్ చేసి.. వదిలిపెట్టిన ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్సార్‌నగర్‌లోని బాపూనగర్‌కు చెందిన సత్యవతి, సత్యనారాయణదంపతుల కూతుళ్లు భవానీ(7),పల్లవి(4) ఆదివారం మధ్యాహ్నం తమ ఇంటి బయట అడుకుంటున్నారు. ఓ గుర్తుతెలియని మహిళ మీ నాన్న పిలుస్తున్నాడని అతని వద్దకు తీసుకువెళ్తానని చెప్పి ఆటో ఎక్కించింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహ్మత్‌నగర్‌కు రాగానే పిల్లలను అక్కడ దింపింది. చెవిపొగులు, కాళ్లపట్టిలు దోచుకొని వదిలి వెళ్లిపోయింది. స్థానిక మహిళ పిల్లలను చూసి వివరాలు అడిగింది. తమను ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు బాధిత చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పటికే విషయం తెలుసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు చిన్నారుల తల్లికి తెలియజేయగా ఆమె వారిని తీసుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.





