Friday, 6 November 2026

కేటీఆర్ కు ఆస్ర్టేలియా ఆహ్వానం

రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆస్ర్టేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిబిట్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2015కు రావాలని ఆహ్వానించింది. మే 5 నుంచి 7 వరకు సిడ్నీలో ఈ వాణిజ్య ప్రదర్శన జరగనున్నది. ఇందులో 30 దేశాల నుంచి 450కి పైగా ఐటీ కంపెనీలు పాల్గొననున్నాయి. మన దగ్గర ఐటీ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ర్టేలియా ఆసక్తి చూపుతోంది. విద్యా, పాడి రంగాల్లో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. నీటి వనరుల నిర్వహణకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *