Friday, 6 November 2026

టిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించండి

zn98hqijపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ కె.కేశవరావు విజ్ఞప్తి చేశారు. దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మండలిలో ఉండటం చాలా అవసరమని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ అభ్యర్ధులకు ఓటు ఎందుకు వేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూసి ఓటు వేయాలని కేకే అన్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచారని, ఆసరా పెన్షన్లు భారీగా పెంచి ఇస్తున్నారని, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారని, అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన్రని ఎంపీ కేకే వివరించారు.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను గెలిపించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతునివ్వాలని కేశవరావు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ కు పాపులర్ ఛాయిస్ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని కేశవరావు అభివర్ణించారు. ఈ అవార్డు ఉద్యమకారులు, అమరవీరులకు అంకితమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ర్టంలో కరెంట్ కోతలు లేకుండా చూస్తున్నామని, సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని కేకే కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే సమయంలో రోజుకు 4 నుంచి 6 గంటల పవర్ కట్ ఉండేదని ఆయన గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *