Thursday, 5 November 2026

కేతకిలో పాంచంగ పఠనం

– హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావు
ఝరసంగం: మార్చి 22 (జనం సాక్షి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో (శోభకృత్ నామ సంవత్సర) ఉగాది పండగ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయం మండపంలో ఏర్పాటుచేసిన పంచాంగ పఠనంలో పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి హరీష్ రావు (ఎమ్మెల్యే మనిక్ రావు సింహరాశి 14 ఆదాయం 2 ఖర్చు) ఆలయ చైర్మన్ వెంకటేశం పేరిట పంచాంగాన్ని గావించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, బిఅర్ఎస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, బిఅర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు పటిల్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, సర్పంచ్ లు బస్వరాజ్ పాటిల్, కిషన్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ విజేందర్ రెడ్డీ, రాజు, లక్ష్మి, పట్టణ మైనారిటీ అద్యక్షుడు ఏజజ్ బాబా, రాజు, మాజీ సర్పంచ్ వెంకటేశం, నాయకులు చింటలఘట్ శివరాజ్, పాండు, వెంకట్ రెడ్డీ, రమేష్ పటేల్, విష్ణు, ప్రవీణ్ పాటిల్, నగేష్, శివ శంకర్, ననిక్యం, ప్రవీణ్, ఆలయ తదితరులు పాల్గొన్నారు.