కేతేపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలి
నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్
పానుగల్ నవంబర్ 23,జనంసాక్షి
కేతేపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్ డిమాండ్ చేశారు.
బుధవారం రోజు మాధవరావుపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కేతేపల్లి గ్రామ ప్రజల చాలా కాలం నుండి ఉన్న కోరిక కేతేపల్లిని మండల కేంద్రం చేయాలని, దానిపై ఏదైనా జివొను తీసుకొస్తారని ఆశించారని, అదేది జరగకపోవడంతో ప్రజలు నిరాశకులోనైనట్లు తెలిపారు.మండల ప్రజల పక్షాన ఎమ్మెల్యే ప్రగతి భవన్ నుండి విడుదల ద్వారా ప్రజలకు సమస్యలు పరిష్కారం అయితాయని ఊహించామని కానీ ఏ ఒక్కటి జరగకపోవడం వారికి నియోజకవర్గంపై ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు.
అదేవిధంగా రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు కానీ ముందు అన్నారం తాండ మరియు గోప్లాపూర్ గ్రామ రైతులకు డి8కాలువకు 2 పైపులు వేస్తే పరిష్కారం చూపొచ్చు ఆ సమస్యను యువజన కాంగ్రెస్ తరపున ఎఈ మరియు డిఈ ల దృష్టికి తీసుకువెళ్ళాం కాబట్టి మా ఒత్తిడితో తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. ఇంత చిన్న పనే చేయలేని ప్రభుత్వం,రిజర్వాయర్లు నిర్మిస్తామంటుంటే ప్రజలు ఎలా నమ్ముతారని,
విద్యుత్ ఎఈ ని కలిసి అన్నారం గ్రామంలో ఉన్న వడ్డెర, బిసి కాలనీలో స్తంభాలు పాడైపోతే కొత్త స్తంభాలు కావాలంటే లేవని చెప్పడం జరిగింది ఇప్పటికి వీధీ దీపాలకు కావాల్సిన వైరు కూడా లేకపోవడం మీ అపరిపక్వ పరిపాలనకు నిదర్శనం కాదా అని మేము ప్రశ్నిస్తున్నామని అన్నారు.రాజ్యాంగ బద్దంగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఓటుతో గెలిపిస్తే కనీసం రాజీనామ చేయకుండా పార్టీ మారి,రాజ్యాంగాన్ని అవమానించిన మీరు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని, మండలంలో ఉన్న భూమిలేని నిరుపేద కుటుంబాలకు 3ఎకరాలు భూమి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సేవాదళ్ ప్రధాన కార్యదర్శి రాచూరి ప్రవీణ్, జమ్మాపూర్, గోప్లాపూర్ గ్రామాల అధ్యక్షులు కొమారి శ్రీనివాసులు, రాఘవేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గోపాల్,యువనాయకులు అంబటి ప్రవీణ్,రాజు గౌడ్,మోహన్ గౌడ్, హుస్సేన్,మాధవరావు పల్లి నాయకులు,నరేందర్రెడ్డి,సుభద్రమ్మ,బాలస్వామి,బాలపీరు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కేతేపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలి




