హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గసమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎన్.రఘువీరారెడ్డి హాజరుకాలేదు. ఈ భేటీలో బంగారు తల్లి పధకానికి చట్టబద్దత, పంచాయితీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.




