కేయూ ఐకాస నేతల అరెస్టు
వరంగల్, (జనంసాక్షి): కూయూ ఐకాస నేతలను కాకతీయ వర్శిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న చలో అసెంబ్లీ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.వాసుదేవరెడ్డి, టీజేఎన్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.



